సీ. పూలబాసలెరుగు పుణ్యమూర్తివి నీవుగంధమద్దిన గాలి గానమీవుమారాకు తొడిగిన మల్లియల వనిలోసౌరభాలను జిమ్ము శార్వరీవుతెల్లజాబిలి చూపు తల్లిపాటవు నీవుమూగ గొంతుక లోని మురిపెమీవుకొండపై దేవుని కోవెల ద్వారానతళుకుమంచు మెఱయు తారవీవు
ఆ. నీవు లేని జగము నిస్సారమయెనయ్య!మనసు మూగబోయె మాట మానిరాటు దేలిపోయి రసహీనమయె భువి,మరల నీగదోయి మనసు పాట!!- వింజమూర్ విజయ కుమార్
( దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి జయంతి సందర్భంగా.....)

No comments:
Post a Comment